Narayanpet: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి బీ ఎస్పీ

Narayanpet: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతి కల్పించాలని కోరుతూ నారాయణపేట అదనపు కలెక్టర్‌కు బీఎస్పీ నేతలు వినతిపత్రం అందజేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 19 Nov 2026 6:09 PM IST
Narayanpet
X

Narayanpet: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి బీ ఎస్పీ

నారాయణపేట: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, ఆరోగ్య, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రo శేఖర్ గారి ఆదేశాల మేరకు నారాయణ పేట జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీను గారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ గారికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆహార నాణ్యత, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత, ప్రత్యేక పర్యవేక్షణ బృందాల ఏర్పాటు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు.ఈ డిమాండ్లపై అడిషనల్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సత్వర చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అజయ్, నారాయణ పేట అసెంబ్లీ అధ్యక్షులు దాసరి అశోక్,మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కొక్కు గౌతం,ఉపాధ్యక్షులు పరుశురాం, ఉట్కూర్ మండల అధ్యక్షులు నాని,బీఎస్పీ నాయకులు వెంకటేష్,బోయ శివ కుమార్,తిమ్మన్న, తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA