Narayanpet: ఎల్‌నినో ఎఫెక్ట్: పాటల ద్వారా నీటి, కరెంట్ పొదుపుపై అవగాహన!
Narayanpet: నారాయణపేట మండలం చిన్న జట్రంలో కలెక్టర్ ఆదేశాలతో ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాంస్కృతిక సారథి కళాకారులు పాటల ద్వారా నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు.
Narayanpet: ఎల్‌నినో ఎఫెక్ట్: పాటల ద్వారా నీటి, కరెంట్ పొదుపుపై అవగాహన!
నారాయణపేట: నారాయణపేట మండలంలోని చిన్న జట్రం గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపు, విద్యుత్ ఆదాపై పాటలు, మాటల ద్వారా నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామంలో పాటలు, మాటల ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చూడాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలు, ఆకుకూరల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా విద్యుత్‌ను అవసరమైనంత మేరకే వినియోగిస్తూ కరెంటును ఆదా చేయాలని ప్రజలకు సూచించారు. నీరు, విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని కళాకారులు తమ పాటల ద్వారా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శితో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నరసింహ, బాలయ్య, భూపతి, సంతోష, పద్మ, ఫ్రాంక్లిన్, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




