Narayanpet: మరికల్ అంబేద్కర్ నగర్లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!
Narayanpet: మరికల్ అంబేద్కర్ నగర్లో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్. 71 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం. సీసీ కెమెరాలపై అవగాహన.
Narayanpet: మరికల్ అంబేద్కర్ నగర్లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!
Narayanpet: నారాయణపేట జిల్లా ఎస్పీ డా. జి. వినీత్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంల అంబేద్కర్ నగర్ కాలనీలో మరికల్ సీఐ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య పాల్గొని ప్రజలకు భద్రతాపరమైన సూచనలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యత, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు, (కార్డన్ అండ్ సెర్చ్)ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను వెల్లడించవద్దని సూచించారు. బాధిత వ్యక్తులు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.కాలనీలు, గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
కాలనీలు, గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో మొత్తం 44 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఒక సీఐ, ఆరుగురు ఎస్ఐలు, 9 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 28 మంది పోలీసు కానిస్టేబుళ్లు, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్లో మొత్తం 125 ఇళ్లను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 71 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ ఎస్సై రామ్ లాల్, ఎస్ఐ లు రమేష్, కృష్ణం రాజు, రేవతి, మహేందర్ రెడ్డి, పోలీసు సిబంధి పాల్గొన్నారు.




