Narayanpet: పోలీసులకు వ్యాసరచన పోటీలు: అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్!

Narayanpet: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్ తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 23 Oct 2026 6:41 PM IST
Narayanpet
X

Narayanpet: పోలీసులకు వ్యాసరచన పోటీలు: అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్!

నారాయణపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించినట్లు అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి రెండు కేటగిరీలుగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కేటగిరీ–1లో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకుపనిచేస్తున్న సిబ్బందికి "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలను ఆశిస్తారు?

“పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర – సోషల్ మీడియాకు బానిస కాకుండా వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?” అనే అంశాలను కేటాయించారు.

కేటగిరీ–2లో ఎస్సై నుంచి పైస్థాయి అధికారుల వరకు పనిచేస్తున్న అధికారులకు “పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి ఏమిటి?” “క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి?” అనే అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థలో ప్రజాసేవ, వృత్తిపరమైన నైపుణ్యం, సామాజిక బాధ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై పోలీసు అధికారులు, సిబ్బందిలో అవగాహన పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వ్యాసాలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్ఐలు కృష్ణ చైతన్య, శిరీషతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA