Makthal: జక్లేర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
Makthal: జక్లేర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!
మక్తల్: మాగనూరు మండలం పెద్దవాగు నుండి ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పక్క సమాచారంతో మక్తల్ మండలం జక్లేర్ సమీపంలో మఖ్తల్ పోలీసులు కాపు కాసి దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక తరలిస్తున్న టిప్పర్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవ్వరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేయబడును అని మక్తల్ SI రాజు తెలిపారు. మక్తల్ SI గా రాజు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అక్రమ ఇసుక తరలింపును అడ్డుకట్ట వేస్తున్న కూడా ఇసుక వ్యాపారులలో మార్పు రావడం లేదు.
కారణం కేసులు అయినా జరిమానా తక్కువగా వేస్తుండడంతో ఇసుక వ్యాపారులు తమ అక్రమ ఇసుక వ్యాపారంను ఆపడం లేదు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.




