Narayanpet: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ను వెనక్కి తీసుకోవాలి: SFI డిమాండ్!
Narayanpet: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని SFI నారాయణపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
Narayanpet: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ను వెనక్కి తీసుకోవాలి: SFI డిమాండ్!
నారాయణపేట: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నవంబర్ 6 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని SFI నారాయణపేట జిల్లా అధ్యక్షులు భాను ప్రసాద్, జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆరు నెలల వ్యవధిలో నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను కేవలం నాలుగు నెలల్లోనే నిర్వహించాలనే నిర్ణయం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సిలబస్ పూర్తిస్థాయిలో బోధించకుండా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల విద్యా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.
యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి నవంబర్ 6 నుంచి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సిలబస్ పూర్తిచేసి విద్యార్థులకు తగిన ప్రిపరేషన్ సమయం ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు మొండిగా వ్యవహరిస్తే SFI ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలతో చర్చించి న్యాయబద్ధమైన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల విద్యా హక్కుల కోసం SFI నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




