Narayanpet: కొల్లంపల్లి గ్రామంలో క్షేత్రస్థాయి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
Narayanpet: నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామంలో టీఆర్‌వీకే సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ మిరప, కంది, ఉల్లి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సలహాలు అందించారు.
Narayanpet: కొల్లంపల్లి గ్రామంలో క్షేత్రస్థాయి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
నారాయణపేట: నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ మిరప, కంది మరియు ఉల్లి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మిరప పంటలో తామర పురుగుల ఉధృతిని పరిశీలించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు పలు చేశారు.మరియు అలాగే, రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలు, వాటి ఎంపిక మరియు పంటల ప్రణాళికపై రైతులతో చర్చించారు.
ముఖ్యంగా వర్షాధార పరిస్థితులకు అనువైన ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.ఈ క్షేత్ర స్థాయి సందర్శనలో రైతులతో నేరుగా మాట్లాడి, పంటల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని తగిన శాస్త్రీయ సలహాలు అందించారు.




