Narva: అర్హులైన పేదలకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

Narva: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నూతన చేయూత పెన్షన్ పత్రాలను ఎంపీడీవో శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు అందజేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 19 Nov 2026 11:08 PM IST
Narva
X

Narva: అర్హులైన పేదలకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

నర్వ: మక్తల్ నియోజకవర్గం, నర్వ మండలంలోని రాంపూర్, పెద్దకడుమూరు, ఎల్లంపల్లి, శ్రీపురం తదితర గ్రామాలకు చెందిన అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ఈరోజు గౌరవ ఎంపీడీవో శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ శరణప్ప, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగన్నగారి వివేకవర్ధన్ రెడ్డి, పెద్దకడుమూరు గ్రామ సర్పంచ్ సత్తన్న, శ్రీపురం గ్రామ సర్పంచ్ ఎల్. శేఖర్, నర్వ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్దల ఆంజనేయ రెడ్డి, శ్రీపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామన్ గౌడ్, ఎల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు బీసం చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ,

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అర్హులకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని బీసం చెన్నయ్య సాగర్ పేర్కొన్నారు.

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల అందజేతతో మహిళా సాధికారతకు బాటలు వేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అదేవిధంగా పెద్దకడుమూరు నుండి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం, నాగిరెడ్డిపల్లి నుండి నంద్యాల వరకు కోట్లాది రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం నర్వ మండల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు.

ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి పట్టుదల, నిరంతర కృషి, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెడుతూ నర్వ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు కొనియాడారు.

పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా నాయకుడు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి ప్రజలందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ.. గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూ.. పేదల కష్టాల్లో అండగా నిలిచే ప్రజా నాయకత్వమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL