Narva: నర్వ మండలం కుమార్లింగంపల్లి బాధితుడికి రూ.4 లక్షల ఎల్ఓసీ అందజేత!

Narva: నారవ మండలం కుమార్లింగంపల్లికి చెందిన టీ తిరుపతికి రూ.4 లక్షల ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) అందజేత. మంత్రి వాకిటి శ్రీహరి సహకారానికి కృతజ్ఞతలు.

B. NARENDER, MAKTHAL
Published on: 4 Nov 2026 9:02 AM IST
Narva
X

Narva: నర్వ మండలం కుమార్లింగంపల్లి బాధితుడికి రూ.4 లక్షల ఎల్ఓసీ అందజేత!

Narva: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారి సహకారాలతో,నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ మరియు జగధాభి రాం రెడ్డి గారి..సమక్షంలో మక్తల్ నియోజకవర్గం: నర్వ మండలంలోని కుమార్ లింగంపల్లి గ్రామ నివాసి, టీ తిరుపతి గారికి ₹4 లక్షల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అందజేయడం జరిగింది.

ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలిచి, మెరుగైన వైద్య చికిత్సకు సహకారం అందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నగారికి, అలాగే ఈ LOC మంజూరులో సహకరించిన నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ గారికి, కుమార్లిగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కుమార్లిగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎల్ విష్ణువర్థన్ రెడ్డి గారు, బిసం రవికుమార్ వెంకట్రం రెడ్డిగారు,పెద్ద గొల్ల శ్రీశైలం,టీ రామకృష్ణ వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు,మరియు నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని నర్వ మండల కాంగ్రెస్ నాయకుడు చెన్నయ్య సాగర్ తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL