Nagarkurnool: బొల్లంపల్లిలో 'నషాముక్త్ భారత్ అభియాన్' అవగాహన సదస్సు!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి ఉన్నత పాఠశాలలో 'నషాముక్త్ భారత్ అభియాన్' సదస్సు జరిగింది.
Nagarkurnool: బొల్లంపల్లిలో 'నషాముక్త్ భారత్ అభియాన్' అవగాహన సదస్సు!
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా , కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 22: మత్తు పదార్థాల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు పడతాయని అంగన్వాడి చెర్కూర్ సెక్టార్ పర్యవేక్షకురాలు సరిత రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెల్దండ మండలం బొల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నషాముక్త్ భారత్ అభియాన్ “వికసిత్ భారత్‌కి పహచాన్” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు,ఉపాధ్యాయులు చంద్రమోహన్ రావు, లలిత, పద్మ, చెన్నకేశవులు, రాజేందర్, మరియు సంబంధిత అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.




