Veldanda: దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కలు చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.
Veldanda: దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కలు చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్!
Veldanda: దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కలు చేపట్టాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు తీస్తామని ప్రకటించి, జనగణన ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీసీల జనాభా లెక్కలు తీసేందుకు వెనుకడుగు వేయడం బాధాకరమనీ పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని డాక్టర్ బీహార్ అంబేద్కర్ విగ్రహానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కొనకచర్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం మరే వర్గానికి జరగడం లేదన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో అధికారికంగా లెక్కిస్తేనే జనాభా ప్రాతిపదికన తమకు రాజ్యాంగబద్ధమైన వాటా దక్కుతుందని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉందని, జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో వాటా దక్కకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ జనగణన చేపట్టిన విధంగానే దేశవ్యాప్తంగా బీసీ కులాల సమగ్ర లెక్కలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల తమ జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియడం లేదని, లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన తమ వాటా కోసం హక్కుగా డిమాండ్ చేయవచ్చని
ఈ కార్యక్రమంలో యువజన సంఘం ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి రాజు, జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్, జంగయ్య, కూన స్కైలాబ్, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, ప్రసాద్, నరసింహ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.




