Pebbair: పెబ్బేరులో బీజేపీ శ్రేణుల ధర్నా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నిరసన

Pebbair: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పెబ్బేరులో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 30 Sept 2026 4:18 PM IST
Pebbair
X

Pebbair: పెబ్బేరులో బీజేపీ శ్రేణుల ధర్నా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నిరసన

పెబ్బేరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పెబ్బేరు మున్సిపల్‌ కేంద్రంలో పెబ్బేరు, పెబ్బేరు రూరల్‌ బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలనే బ్రిటీష్‌ విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. అనంతరం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU