Pebberu: పెబ్బేరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంపై నిరసన
Pebberu: పెబ్బేరు పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థినులు అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా పట్టించుకోని ప్రిన్సిపల్‌ను బీఆర్‌ఎస్, అఖిలపక్ష నేతలు నిలదీశారు.
Pebberu: పెబ్బేరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంపై నిరసన
పెబ్బేరు: పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురై ఉదయం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారిని పరామర్శించడంలో కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినులు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రిన్సిపల్ స్పందించకపోవడంపై నాయకులు ప్రశ్నించారు. ఫోన్‌లో సంప్రదించగా “భోజనం చేస్తున్నాను.. చేసి వస్తాను” అంటూ సమాధానం ఇవ్వడం బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు.
దీంతో నాయకులు ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి వెంటనే ఆసుపత్రికి రావాలని కోరారు. ప్రిన్సిపల్ అక్కడికి చేరుకున్న సమయంలో నాయకులు చప్పట్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఆమెను నిలదీశారు. విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.
హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వార్డెన్, ప్రిన్సిపల్‌పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా కోరారు.




