Pebbair : జాతీయ అండర్-17 క్రికెట్కు ఎంపికైన కిణీషాను సన్మానించిన నిరంజన్ రెడ్డి!
Pebbair : జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ అండర్-17 క్రికెట్ పోటీలకు ఎంపికైన పెబ్బేరు విద్యార్థిని ఆర్. కిణీషాను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
Pebbair : జాతీయ అండర్-17 క్రికెట్కు ఎంపికైన కిణీషాను సన్మానించిన నిరంజన్ రెడ్డి!
Pebbair: జమ్మూ కాశ్మీర్లో జరగనున్న జాతీయ అండర్-17 క్రికెట్ పోటీలకు భారతదేశం తరఫున ఎంపికైన యువ క్రీడాకారిణి ఆర్. కిణీషాను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించి సన్మానించారు. తన స్వగృహంలో కిణీషాను ఘనంగా సత్కరించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
పెబ్బేరు పట్టణంలోని చాణక్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కిణీషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు. తగిన ప్రోత్సాహం, శిక్షణతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు ప్రాంతానికి, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురాగలరని పేర్కొన్నారు.
కిణీషాకు శిక్షణ అందించిన కోచ్లు రాంబాబు, కృష్ణతో పాటు ఆమె తల్లిదండ్రులు కరుణశ్రీ, మహేశ్వర్ రెడ్డిని కూడా నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, బాలిశ్వర్ రెడ్డి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.




