Kalwakurthy: పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి గోలి శ్రీనివాస్ రెడ్డి సంతాపం!

Kalwakurthy: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 31 July 2026 11:59 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి గోలి శ్రీనివాస్ రెడ్డి సంతాపం!

Kalwakurthy: తెలంగాణ ఉద్యమ సహచరుడు,మాజీ ఎమ్మెల్యే,నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రె గారి మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి,తీవ్ర విషాదానికి గురిచేసింది. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం.ఉద్యమ ఆశయాలను విశ్వసిస్తూ,జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి,పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారు.

ఆయన మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు,తెలంగాణ సమాజానికే తీరని లోటు. ఆయన చూపిన నిబద్ధత,ఉద్యమ స్ఫూర్తి, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం పార్టీ శ్రేణులకు,భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు తెలియజేస్తున్నాను.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story