Makthal: పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 44 వాహనాలు సీజ్!

Makthal: మక్తల్ పట్టణంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి తనిఖీలు చేపట్టారు.

B. NARENDER, MAKTHAL
Published on: 27 Oct 2026 10:21 AM IST
Makthal
X

Makthal: పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 44 వాహనాలు సీజ్!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో ఐదు మంది ఎస్ఐలు, ఎ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మొత్తం 40 మంది పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఇట్టి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 44 ద్విచక్ర వాహనాలను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అనంతరం సరైన పత్రాలు తీసుకువచ్చిన వాహనాలను వదిలేసి మిగతా వాటిపై కేసులు చేసినట్లు సిఐ తెలిపారు.

నేరాలను అరికట్టడానికి, అసాంఘిక శక్తులను లేదా అనుమానితులను పట్టుకోవడానికి రోడ్డు పరిసర ప్రాంతాలలోని పలు ఇళ్లను, వ్యాపార సముదాయాలను ఇళ్లలోని నివాసితులు, అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఇట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎస్సైలు రాజు, నవీద్,రమేష్, మహేంద్ర రెడ్డి, రమేష్, రేవతి, ఏఎస్ఐ శంకరయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL