Nagarkurnool: ఎస్ఐగా పదోన్నతి పొందిన శ్రీనివాసులకు ఘన సన్మానం!

Nagarkurnool: వెల్దండ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి ఎస్ఐగా పదోన్నతి పొందిన శ్రీనివాసులకు ఘన సన్మానం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో వీడ్కోలు, సత్కార కార్యక్రమం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Oct 2026 9:28 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఎస్ఐగా పదోన్నతి పొందిన శ్రీనివాసులకు ఘన సన్మానం!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం వెల్దండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఎస్ఐగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న శ్రీనివాసులు ను వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసులు తన విధి నిర్వహణలో చూపిన అంకితభావం, బాధ్యతాయుతమైన సేవలను కొనియాడిన సర్పంచ్ వెంకటయ్య గౌడ్, పదోన్నతితో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త బాధ్యతల్లోనూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీనివాసులను శాలువాతో ఘనంగా సత్కరించి, భవిష్యత్ సేవా ప్రయాణం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ నాయకులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY