Maldakal: పేద ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలనలో నెరవేరింది: ఎమ్మెల్యే
Maldakal: గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం పాల్వాయి గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించి హర్షం వ్యక్తం చేశారు.
Maldakal: పేద ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలనలో నెరవేరింది: ఎమ్మెల్యే
గద్వాల నియోజకవర్గం: మల్డకల్ మండలం పరిధిలోని పాల్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యేకి లబ్ధిదారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగింది. వాటికి తోడుగా లబ్ధిదారులు మరికొంత డబ్బులను తో ఇంటిని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకోవడం జరిగినది.




