Veldanda: వెల్దండలో వేగంగా విద్యుత్ పనులు.. సమస్యల్లేని గ్రామమే లక్ష్యం!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో విద్యుత్ సంబంధిత మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 9:42 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో వేగంగా విద్యుత్ పనులు.. సమస్యల్లేని గ్రామమే లక్ష్యం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో విద్యుత్ సంబంధిత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, గ్రామపంచాయతీ సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామపంచాయతీ ప్రధాన లక్ష్యమన్నారు.

విద్యుత్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు పుల్లయ్య, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY