NagarKurnool: టెన్త్ టాపర్లకు నగదు బహుమతులు అందజేత!

NagarKurnool: వెల్దండ మండలం రాచూర్ సర్పంచ్ శ్రీనివాసులు మంచి మనసు. పదవ తరగతి టాపర్లకు రూ.10 వేలు, రూ.5 వేల నగదు బహుమతి అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Aug 2026 1:16 PM IST
NagarKurnool
X

NagarKurnool: టెన్త్ టాపర్లకు నగదు బహుమతులు అందజేత!

NagarKurnool: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల రాచూర్ గ్రామ సర్పంచ్ శ్రీ.గున్నేళ్ళ శ్రీనివాసులు మరొమారు మంచి మనసు చాటుకున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ స్థానం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు మనీ ప్రైస్ ని అందజేస్తామని ఇచ్చిన హామీ మేరకు2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రథమ స్థానం సాధించి మండల టాపర్ గా నిలిచిన మహమ్మద్ అనియా కి 10,వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన కాత్యాయనకి 5వేల రూపాయలని

నేడు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేసినట్టు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ప్రతి సంవత్సరం ఉత్తమ మార్కులతో గ్రామానికి పాఠశాలకి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమం లో ఉప్ప సర్పంచ్ గణేష్, రామార్జున్, రమేష్, ప్రీమ్, కృష్ణయ్య, తాజుదిన్, పాషా, పాఠశాల సిబంది పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story