Narayanpet: బాధితుల వద్దకే వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్: ఎస్పీ డా. వినీత్
Narayanpet: స్టేషన్‌కు రాలేని బాధితులు, వృద్ధులు, మహిళల వద్దకే నేరుగా వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశించారు.
Narayanpet: బాధితుల వద్దకే వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్: ఎస్పీ డా. వినీత్
నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా పరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన వారి వద్దకే వెళ్లి ఆన్‌సైట్‌లో ఫిర్యాదు స్వీకరించి FIR నమోదు చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పోలీసు అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ... ప్రజలు తమకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు లేదా నేరానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, అవసరమైన సందర్భాల్లో అక్కడికక్కడే ఆన్‌సైట్ FIR నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి అని ఆయన తెలిపారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, గాయపడిన బాధితులు, పిల్లలు/మైనర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు, అలాగే దూరప్రాంతాల్లో ఉన్న బాధితులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.
బాధితుల భద్రత, గౌరవం, గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలకు పోలీస్ శాఖ పై నమ్మకం మరింత పెరిగేలా ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి అని ఎస్పీ తెలిపారు.




