Veldanda: పెద్దాపూర్కు చెందిన లక్ష్మమ్మకు రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత!
Veldanda: పెద్దాపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును నాయకులు అందజేశారు.
Veldanda: పెద్దాపూర్కు చెందిన లక్ష్మమ్మకు రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత!
Veldanda: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ కు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.40 వేల ఆర్థిక సాయం చెక్కును గురువారం ఉదయం గ్రామంలో అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ఈ చెక్కును బాధితురాలికి అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ, వార్డు సభ్యులు తిరుపతి నాయక్, కేశమల్ల మమత అనిల్, మాడుగుల వెంకటయ్య, గంగాపురం శ్రీశైలం, ధన్ మంత్రి, జంగయ్యగౌడ్, ఎస్. సుధాకర్, ఎం. వెంకటేష్, పసుపుల రాఘవేందర్, కృష్ణమాచారి, ప్రవీణ్ నాయక్, సంతు నాయక్, కే. శ్రీను, ఎం. లింగయ్య, కే. ప్రశాంత్, శ్రీశైలం, కొండల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




