Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ సమ్మె సెగ.. రెండో రోజు స్తంభించిన రవాణా
Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. పది డిపోల వద్ద బస్సులను అడ్డుకున్న కార్మికులు.
Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ సమ్మె సెగ.. రెండో రోజు స్తంభించిన రవాణా
Mahabubnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులచేపట్టిన సమ్మె రెండో రోజు ఉదృతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పది ఆర్టీసీ డిపోలో వద్ద కార్మికులు బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు ప్రైవేట్ ఉద్యోగులతో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతbచర్చలు జరిపేందుకు స్పందిస్తే చర్చలు జరిపెందుకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మికులు పేర్కొంటున్నారు. రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ సమ్మెకు సంఘీభావం తెలిపారు మీరు చేస్తున్న సమ్మె 100% సభమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగానే ఉందంటూ ఆర్టీసీ కార్మికుల ఉద్దేశించి వారు మాట్లాడారు ఈ సమ్మె ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కనుక ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమింప చేసుకోవాలని వారు కోరారు. కార్మికుల యొక్క డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారు.




