Cherukuru: శివాలయం, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

Cherukuru: నాగర్‌కర్నూల్ చెరుకూరులో నిర్మిస్తున్న శివాలయం, ఆంజనేయ దేవాలయాల నిర్మాణానికి సైదాబాద్ తహశీల్దార్ ఏ. మణిపాల్ రెడ్డి రూ.1,00,116 విరాళం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Oct 2026 2:15 PM IST
Cherukuru
X

Cherukuru: శివాలయం, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం చెరుకూరు గ్రామంలో నిర్మిస్తున్న శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి గోకారం గ్రామానికి చెందిన, ప్రస్తుతం సైదాబాద్ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ. మణిపాల్ రెడ్డి రూ.1,00,116/ (ఒక లక్షా నూట పదహారు) రూపాయలు విరాళంగా అందజేశారు. దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం పట్ల ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మణిపాల్ రెడ్డికి కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కుటుంబంపై పరమేశ్వరుడు, ఆంజనేయస్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వీరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY