Makthal: మక్తల్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Makthal: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మక్తల్ ఆజాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి. కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 31 Oct 2026 2:55 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

మక్తల్: ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆజాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు బి. కొండయ్య గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, బార్డోలీ సత్యాగ్రహంలో రైతుల హక్కుల కోసం పోరాడి ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.

స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించి 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.మరీ ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కావడం శ్రీ.సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారి సాహసోపేత నిర్ణయం,కృషి వల్లే సాధ్యమైందని ఆయన పరిపాలనా దక్షత, దృఢమైన నాయకత్వం, దేశ సమగ్రత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొండయ్య కొనియాడారు. అందుకే ఆయనను భారత ఉక్కు మనిషిగా పిలుస్తారని తెలిపారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కర్నె స్వామి,రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ , చిన్న క్రిష్ణయ్య,చంద్రశేఖర్, సూర్య ఆంజనేయులు ఇతర నాయకులు పాల్గొన్నారుటైలర్ నరేందర్ జనరల్ సెక్రటరీ, బ్యాటరీ రాజు, మహేష్ సాగర్, ఆంజనేయులు, తప్ప కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్, పీకే నరసింహ మున్సిపల్ కౌన్సిలర్, విద్యాసాగర్, తప్ప అశోక్, కల్లూరి ఆంజనేయులు, పాల ప్రవీణ్, చంద్రపూర్ లారెన్స్, రవి తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL