Vangur: పోల్కంపల్లిలో పంచాయతీ కార్మికులకు రక్షణ పరికరాల పంపిణీ!
Vangur: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ అంకు నారమ్మ బూట్లు, గ్లౌసులు, మాస్కులు వంటి రక్షణ పరికరాలను పంపిణీ చేశారు.
Vangur: పోల్కంపల్లిలో పంచాయతీ కార్మికులకు రక్షణ పరికరాల పంపిణీ!
Vangur: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామం గ్రామ పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు నిత్యం శ్రమిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సంక్షేమానికి సర్పంచ్ అంకు నారమ్మ చొరవ తీసుకున్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పెద్ద బూట్లు, చేతి తొడుగులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంకు నారమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీలు, రహదారులను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. విధులు నిర్వహించే సమయంలో కార్మికుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అవసరమైన రక్షణ పరికరాలను అందించినట్లు పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వసతులు కల్పిస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పెద్దలు పాల్గొన్నారు.




