Kalwakurthy: తాండ్రలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Nov 2026 10:20 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: తాండ్రలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన వారికి రూ.5 లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు.

గ్రామంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి అండగా నిలుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిలీల, ఉపసర్పంచ్ సరిత ఈదమయ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY