Nagarkurnool: చేర్కూర్ గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్పంచ్!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు.
Nagarkurnool: చేర్కూర్ గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్పంచ్!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చేర్కూర్ గ్రామాన్ని చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం పారిశుధ్య పనులు చేపట్టారు.
గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య సిబ్బందితో తొలగించారు. గ్రామంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా రోజువారీ శుభ్రం చేస్తున్నామని సర్పంచ్ శ్రీనివాసులు తెలిపారు.
గ్రామస్తులు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా, పంచాయతీ ట్రాక్టర్ కు అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లాలయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.




