Kuravi: ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి రాథోడ్!

Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవిలో మృతి చెందిన అంగన్‌వాడీ టీచర్ ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 25 Sept 2026 2:16 PM IST
Kuravi
X

Kuravi: ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి రాథోడ్!

Kuravi: డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్ బండారి ఉమామహేశ్వరి ఇటీవల మృతి చెందగా, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ శుక్రవారం ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఉమామహేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమామహేశ్వరి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కురవి మండల బీఆర్‌ఎస్ నాయకులు ఐలి నరహరిగౌడ్, బోడ శ్రీనునాయక్, బాదే నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL