Kanchiraopally: జెడ్పీహెచ్‌ఎస్‌లో 150 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

Kanchiraopally: కంచిరావుపల్లి పాఠశాలలో 150 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ. గ్రామ భారతి, యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతుల అందజేత.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 16 Aug 2026 12:59 PM IST
Kanchiraopally
X

Kanchiraopally: జెడ్పీహెచ్‌ఎస్‌లో 150 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

Kanchiraopally: పెబ్బేరు మండలం కంచిరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పదవ తరగతిలో మెరిట్ తో పాటు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గ్రామ భారతి యూత్ ఫర్ సేవా సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అరుణ పాల్గొని పంపిణీ చేశారు. గ్రామ భారతి యూత్ ఫర్ సేవా సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల హెడ్మాస్టర్ గా పనిచేసిన కీ" శే" రమేష్ సార్ జ్ఞాపకార్థం, కీ" శే" బిచ్చన్న గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు శివశంకర్, కోటేశ్వర్ గౌడ్ లు ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు 4000 రూపాయల బహుమతిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, ఉప సర్పంచ్ అశోక్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ భారతి సభ్యులు శివకుమార్, రాచాల వెంకటేష్, జైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఫోటోగ్రాఫర్ కృష్ణ, రాఘవేందర్ గౌడ్, పంచాయతీ సెక్రెటరీ మల్లయ్య, గ్రామస్తులు విద్యార్థినీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story