Narayanpet: నారాయణపేటలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ డా. వినీత్

Narayanpet: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నవంబర్ 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 1 Nov 2026 3:14 PM IST
Narayanpet
X

Narayanpet: నారాయణపేటలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ డా. వినీత్

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. వినీత్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే విధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు.

ప్రజా జీవనానికి, రాకపోకలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సమావేశాలు నిర్వహించడం, జన సమూహాలను ఏర్పాటు చేయడం నిషేధమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే తప్పుడు వార్తలు, అభ్యంతరకరమైన పోస్టులు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

30 పోలీస్ యాక్ట్ ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగానే పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA