Makthal: మక్తల్‌లో ముగిసిన సెట్విన్ 2వ బ్యాచ్ తుది పరీక్షలు!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ 2వ బ్యాచ్ విద్యార్థులకు ముగిసిన తుది రాత, ప్రాక్టీకల్ పరీక్షలు. 222 మంది విద్యార్థుల హాజరు.
Makthal: మక్తల్‌లో ముగిసిన సెట్విన్ 2వ బ్యాచ్ తుది పరీక్షలు!
Makthal: మక్తల్ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ 2వ బ్యాచ్ విద్యార్థులకు శిక్షణ పూర్తి కావడంతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎగ్జామినర్ల సమక్షంలో తుది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్ముద్దీన్ కంప్యూటర్ ట్రైనింగ్, అజ్మత్ ఉన్నీసా జర్దోసీ, శిల్ప ఫ్యాషన్ డిజైనింగ్, అయేషా సుల్తానా బ్యుటీషియన్ కోర్సులకు ఎగ్జామినర్ లుగా వ్యవహరించారు.
మొత్తం 222 మంది విద్యార్థులకు ఉదయం రాత పరీక్షలు, మధ్యాహ్నం ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించారు. త్వరలో ఫలితాలు వెల్లడించి విద్యార్థులకు సర్టిఫికెట్ లు అందజేస్తామని తెలిపారు. సెట్విన్ కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, కంప్యూటర్ ట్రైనర్ తిమ్మప్ప, జర్దోసీ మగ్గం వర్క్ ట్రైనర్ వీరమ్మ, బ్యుటీషియన్ ట్రైనర్ స్వప్న, ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనర్ ఫర్జానా, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మీ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.




