Narayanpet: ఘనంగా ఎస్ఎఫ్ఐ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు!
Narayanpet: నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా జరిగాయి.
Narayanpet: ఘనంగా ఎస్ఎఫ్ఐ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు!
Narayanpet: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు నారాయణపేట మండలంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నారాయణపేట పట్టణ ఎస్ఐ గాయత్రి ముఖ్య అతిథిగా హాజరై చెకుముకి సైన్స్ సంబరాల పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఐ గాయత్రి గారిని ఎస్ఎఫ్ఐ బాలికల కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నాయకులు నరహరి, జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే నారాయణపేట మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, చెకుముకి సైన్స్ సంబరాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశోధనా దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. మండల స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సహకరించిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




