Bijinapally: పాలెం వేంకటేశ్వర స్వామికి వెండి లక్ష్మీహారం సమర్పణ

Bijinapally: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రాముగౌడ్, లలిత దంపతులు 301 గ్రాముల వెండి లక్ష్మీహారాన్ని సమర్పించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 25 Oct 2026 10:04 PM IST
Bijinapally
X

Bijinapally: పాలెం వేంకటేశ్వర స్వామికి వెండి లక్ష్మీహారం సమర్పణ

నాగర్‌కర్నూల్ జిల్లా: బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, గ్రామానికి చెందిన కీర్తిశేషులు కృష్ణయ్య గౌడ్ చిన్న కుమారుడైన రాముగౌడ్, లలిత దంపతులు 301 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేయించిన మామిడి పిందెల లక్ష్మీహారాన్ని, ఆదివారం దేవాలయంలో స్వామి వారికి భక్తితో సమర్పించారు.

రాముగౌడ్ దంపతులు వెంకన్న స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.వెంకన్న స్వామివారిపై, తమకున్న భక్తిని చాటుకున్నారు.భక్తులు తమకు తోచిన విధంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తూ,దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని, ఈ దంపతుల భక్తి ఇతర భక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి జనుంపల్లి జయపాల్ రెడ్డి, ప్రధానఅర్చకులు కొరవి రామానుజా చార్యులు, అర్చకులు జయంత్,శుక్ల, దేవస్థాన సిబ్బంది ఆర్. శివకుమార్,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL