Wanaparthy: వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
Wanaparthy: వనపర్తి మార్కెట్ యార్డులో తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
Wanaparthy: వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
వనపర్తి: మార్కెట్ యార్డులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తెచ్చి 50 రోజులు గడిచిన రైతుల సమస్య పరిష్కారం కాలేదు. ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదు.
దేశంలోనే నెంబర్ వన్ గా యాసంగి పంట తెలంగాణలో వచ్చింది. లారీలు ట్రక్కులు లేని అనర్హులకు టెండర్లు ఇవ్వడం వల్ల రైతులకు ఈ సమస్య వచ్చింది. స్టీఫెన్ రవీంద్ర పై మాకు నమ్మకం ఉంది. వడ్ల కొనుగోలు వాహన టెండర్ల అవకతవకల విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు లేఖ వ్రాయండి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు పంట పండించి అమ్ముకో లేని దుస్థితిలో ఉన్నాడు. టిఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన మూడు నాలుగు కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి. ధాన్యం కొనుగోలు కాక వాటిని తరలించక రైతులు పడిగా పలుకాస్తూ పంట చేతికి వచ్చిన తర్వాత బిక్కు బిక్కుమంటున్నారు.
ఒక మిల్లరు ప్రభుత్వానికి 120 కోట్ల పెండింగ్ ఉంది. అతనికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు మూడు మండలాలకు ఇచ్చారు. ఓ మంత్రి కొడుకుకు రేంజ్ రోవర్ కారు ఇప్పించడం వల్లే ఇతనికి ఈ టెండర్ దక్కింది. పెండింగ్ లో ఉన్న మిల్లర్లపై 33 మందికి పై యాక్షన్ తీసుకొని అధికార పార్టీ మద్దతు ఉన్న 23 మిల్లర్లపై యాక్షన్ తీసుకోలేదు.
అలాట్మెంట్ ఇచ్చిన అధికారులు జైలుకు పోతారు. అందరి పట్ల అధికారులు ఒకేలాగా వ్యవహరించాలి. తప్పులు ఉన్న జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షునికి అధికారులు సహకరించారు.




