Nagarkurnool: ఉబ్బలగట్టు తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఉబ్బలగట్టు తండాలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Nagarkurnool: ఉబ్బలగట్టు తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Nagarkurnool: గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆర్. కేశ్య నాయక్, ఉప సర్పంచ్ ఆర్. జీవుల నాయక్ కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కేశ్య నాయక్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్. గమ్లీ, వార్డు సభ్యుడు ఆర్. పద్మ రాజు, అనిల్, అంజయ్య, పద్మ, రాములు, శంకర్, జీవుల, హథీరాం, తుల్చ్య, శాంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.




