Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నివాళులర్పించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 26 Sept 2026 3:53 PM IST
Nagar Kurnool
X

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS గారు చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, అన్యాయంపై ఆమె సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు,పోలీస్ కార్యాలయ ఏవో కృష్ణయ్య, ఆర్ఐ జగన్, ఎస్ఐలు రమేష్, వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీలతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL