Pebberu: పెబ్బేరులో నిలిచిన మురుగు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Pebberu: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట వద్ద మురుగు నీరు నిలిచి దుర్వాసన, దోమల బెడద పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Pebberu: పెబ్బేరులో నిలిచిన మురుగు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
వనపర్తి జిల్లా: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని వినాయక నగర్ కాలనీ నుంచి మురుగు కాలువ నీటిని కిష్టారెడ్డిపేట ప్రాంతం వైపు వదలడంతో అక్కడ మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ ఉన్న మురుగు నీటి నుంచి వెలువడుతున్న దుర్వాసనతో అటువైపు వెళ్లే బాటసారులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు.
మురుగు నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో దోమలు, ఇతర క్రిమికీటకాలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే వారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
ఈ సమస్యపై పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, సంబంధిత కౌన్సిలర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించడంతో పాటు, నీరు సాఫీగా వెళ్లేందుకు సరైన కాలువ మార్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, బాటసారులు కోరుతున్నారు.




