Mahabubnagar: దేవరకద్ర మండలం డోకూరులో పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్!
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో కలెక్టర్ కుష్బూ గుప్తా పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
Mahabubnagar: దేవరకద్ర మండలం డోకూరులో పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్!
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో బుధవారం రోజు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా గ్రామంలోని పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు.
రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ పనులు మరియు అంగన్వాడి సబ్ సెంటర్లు వాటి యొక్క నిర్వహణ మరియు గ్రామంలో జరుగుతున్న పనులు పరిశీలించారు. ప్రభుత్వ హై స్కూల్ ,ఎంపీపీ స్కూల్, మరియు ప్రీ ప్రైమరీ సెంటర్ ను సందర్శించి టీచర్ల యొక్క బోధన విధానాలు మరియు స్కూళ్ల నిర్వహణ మధ్యాహ్న భోజన నిర్వహణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని
సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలెల శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.




