Nagaragadda: శ్రీ మేరమ్మయాడి ఆలయ గడప ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహణ
Nagaragadda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాలోని శ్రీ మేరమ్మయాడి దేవాలయంలో గడప ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
Nagaragadda: శ్రీ మేరమ్మయాడి ఆలయ గడప ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహణ
Nagaragadda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం నగారా గడ్డ తండాలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీ మేరమ్మయాడి దేవాలయంలో నిర్వహించిన గడప ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది,
ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O శ్రీసుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు,
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆలయ నిర్మాణం అమ్మవారి ఆశీస్సులతో త్వరితగతిన పూర్తవ్వాలని ఆకాక్షించారు,
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు,ప్రజల ఐక్యత, గ్రామ అభివృద్ధికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ శారదా సాల్య నాయక్. ఉప సర్పంచ్ లలిత శంకర్,మాజీ సర్పంచ్ దశరథ్ నాయక్, వార్డ్ మెంబర్ శంకర్ నాయక్, బిచ్యా, గ్రామ పెద్దలు లాలు నాయక్, వశ్య నాయక్,లోకిలాల్, శ్రీను, నరేష్, రాము, సుమన్, లతో పాటు గ్రామ మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




