Nagarkurnool: హనుమాన్ ఆలయ అభివృద్ధికి సహకారం: రాఘవేందర్ రెడ్డి
Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్లో పర్యటించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, హనుమాన్ ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Nagarkurnool: హనుమాన్ ఆలయ అభివృద్ధికి సహకారం: రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా: ఈరోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామాన్ని సందర్శించిన.. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.
గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి, దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
గ్రామస్తుల అవసరాలు, కోరికలకు స్పందిస్తూ.. అజిలాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. గ్రామ పార్టీ అధ్యక్షులు సల్వాది అంజయ్య,మాజీ సర్పంచ్ సల్వాది జంగయ్య, వార్డు సబ్యులు కేశమోని నిర్మల సైదులు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పల్స మల్లయ్య,గ్రామ సీనియర్ నాయకులు కేశమోని శ్రీను, ఆనందం,సత్తయ్య,శేఖర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




