Vikarabad: ఎవాక్యూ ప్రాపర్టీ ఆక్రమణపై MRO స్పందించాలి సూరజ్ సింగ్!

Vikarabad: వినాయక చౌక్ వద్ద ఉన్న 484 గజాల ఎవాక్యూ ప్రాపర్టీని అధికారులు, నాయకులు కుమ్మక్కై ఆక్రమిస్తున్నారని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సూరజ్ ఆరోపించారు.

Srikanth Reddy, Tandur
Published on: 15 Aug 2026 8:48 AM IST
Vikarabad
X

Vikarabad: ఎవాక్యూ ప్రాపర్టీ ఆక్రమణపై MRO స్పందించాలి సూరజ్ సింగ్!

Vikarabad: తాండూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న వినాయక చౌక్ ప్రాంతంలో ఉన్న 484 గజాల ఎవాక్యూ ప్రాపర్టీ ని అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ సూరజ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు.

ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, వినాయకచౌక్ ప్రాంతంలోని 484 గజాల ఎవాక్యూ ప్రాపర్టీని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ లాభం పొందడానికి అధికారులు నాయకులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోయడం హర్షించదగ్గ విషయం కాదన్నారు.

తాండూర్ కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు మీదుగా ఇంటి నెంబర్లు కేటాయించుకొని ఎవాక్యూ ప్రాపర్టీ ఆస్తిని ఆక్రమించుకోవడానికి పెద్ద ఎత్తున కుట్రకు అధికారుల సహాయంతో తెర లేపారన్నారు.అక్రమ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఒక్కో దుకాణాన్ని రెండు నుండి మూడు కోట్లకు విక్రయించే విధంగా పథకాన్ని రూపొందించుకున్నారన్నారు.

ఈ భూమి ఎవాక్యూ ప్రాపర్టీ అని తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది ఎవాక్యూ ప్రాపర్టీ కాదు ప్రైవేటు భూమి అని వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రకటన చేయాలని ఆధారాలను చూపించాలని ఈ సందర్భంగా తాను డిమాండ్ చేస్తున్నానన్నారు.

తహసిల్దార్ తారాసింగ్ ఈ భూమి ఎవాక్యూ ప్రాపర్టీ కాదు అని నిరూపిస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఈ భూమికి సంబంధించి పూర్తి సాక్షాదారాలు పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఈ భూమికి ఇంటి నెంబర్లు ఎలా కేటాయిస్తారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. 2011లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తాను లోకాయుక్త లో ఆర్జీ సమర్పించడం జరిగిందన్నారు.

గతంలో ఈ ప్రభుత్వ ఆస్తిపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ విషయమై తాండూరు పోలీస్ స్టేషన్ కి ఈ విషయంపై సమగ్ర విచారణ చేయవలసిందిగా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు రావడం జరిగిందన్నారు. ఈ ఆస్తికి చట్టబద్ధమైన యజమాని లేడన్నారు. ఎవరైతే ఆక్రమణ సాగిస్తున్నారో వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఇది ఎవాక్యూ ప్రాపర్టీ కాదని తమకు సంబంధించిన ప్రైవేటు ఆస్తిని ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.

అక్కడ ఉండి నిర్మాణాలకు తెరలేపిన ఓ ప్రముఖ వ్యక్తి ని బినామీగా చేసి ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారన్నారు. అతనిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయమై వెంటనే నిజాలను ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story