Gadwal: ఎల్ నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సమిష్టిగా కృషి: అదనపు కలెక్టర్

Gadwal: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నేపథ్యంలో ఎల్ నినో ప్రభావాలను సమష్టిగా ఎదుర్కోవాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆదేశించారు.

GOKARANNA,  GADWAL
Published on: 6 Nov 2026 9:46 PM IST
Gadwal
X

Gadwal: ఎల్ నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సమిష్టిగా కృషి: అదనపు కలెక్టర్

Gadwal: ఎల్ నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సమీక్షించారు.

పీఎం పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ప్రత్యేక కార్యాచరణతో తగు చర్యలు చేపట్టాలన్నారు. చేతిపంపుల మరమ్మత్తులు, పైప్ లైన్స్ లీకేజీలను అరికట్టడం వంటి పనులను చేయించాలన్నారు. విబి జీరాంజీ పథకంలో భాగంగా ప్రస్తుత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఇటీవల 5.38 లక్షల కూలీలకు ఉపాధి పనులు కల్పించిన రికార్డు రావడం గర్వకారణం అన్నారు. జలసిరి పనులను ఎక్కువగా చేపట్టడం వలన నీటి సంరక్షణకు కృషి చేయవచ్చన్నారు. ఆసరా పెన్షన్ల దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్హుల జాబితాను

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL