Talakondapally: తలకొండపల్లి ఎస్సై శేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

Talakondapally: తలకొండపల్లి ఎస్సై శేఖర్ పుట్టినరోజు వేడుకలు. స్టేషన్‌లో కేక్ కట్ చేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్‌లు, స్థానిక నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 8:09 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లి ఎస్సై శేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

తలకొండపల్లి: తలకొండపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్సై శేఖర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, స్టేషన్లో కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించారు.

యువకులకు ఆదర్శప్రాయుడు, సౌమ్యుడు, విద్యావేత్త, అందర్నీ ప్రేమతో పలకరిస్తూ.. మొఖంపై ఎప్పుడు చిరునవ్వు కురిపిస్తూ...ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ ధైర్యం కల్పించే యువకిశోరం శేఖర్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండడమే ఆయన నైజం.. కలం పట్టి చదువు నేర్పిన ఉపాధ్యాయుడే నేడు గన్ను పట్టి శాంతిభద్రతలను కాపాడుతున్నాడు.

వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ.. సెల్యూట్ సర్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన స్థానాలను పొందాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ అంతారం సర్పంచ్ భాలస్వామి మాదయాపల్లి సర్పంచ్ సుధాకర్ రాంపూర్ చెరువు జనరల్ సెక్రెటరీ చిలుకం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story