Madugula: బీజేపీ నేత వడ్డేపల్లి శ్రీను మృతికి తల్లోజు ఆచారి నివాళి

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీను మృతికి నివాళులర్పించిన తల్లోజు ఆచారి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 8:38 PM IST
Madugula
X

Madugula: బీజేపీ నేత వడ్డేపల్లి శ్రీను మృతికి తల్లోజు ఆచారి నివాళి

మాడుగుల: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, మాడుగుల మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీను ఆగస్టు 7, 2026న మృతి చెందారు.

విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి నల్లచెరువు గ్రామానికి చేరుకుని శ్రీను అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్రీను పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తల్లోజు ఆచారి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీను గారి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ అంతిమయాత్రలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొని వడ్డేపల్లి శ్రీను నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story