Kalwakurthy: ఘనంగా తాండ్ర సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

Kalwakurthy: తాండ్ర గ్రామ సర్పంచ్ కాయితి ఆశాదీప్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Oct 2026 10:50 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఘనంగా తాండ్ర సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సర్పంచ్ కాయితి ఆశాదీప్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఆశాదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ ప్రజల సమక్షంలో ఉత్సాహభరితంగా సాగాయి. గ్రామ పెద్దలు ఆశీర్వదించగా, మహిళలు, యువత, చిన్నారులు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో తాండ్ర గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ తాండ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ ఆశాదీప్ రెడ్డికి ప్రజల నుంచి లభించిన ఆప్యాయత, అభిమానం ప్రత్యేకంగా నిలిచింది. గ్రామ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని పలువురు ఆకాంక్షించారు.

ప్రజల ఆశీస్సులతో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, తాండ్ర గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని కోరుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY