Kalwakurthy: సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు భరోసా: ఫుడ్ కమిషన్ చైర్మన్!

Kalwakurthy: తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లికి చెందిన రాసులపల్లి స్వప్నకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. కల్వకుర్తిలో చెక్కు పంపిణీ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Sept 2026 11:23 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు భరోసా: ఫుడ్ కమిషన్ చైర్మన్!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన *రాసులపల్లి స్వప్నకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.25,000ల చెక్కును* ఈరోజు కల్వకుర్తిలో వారి కుటుంబ సభ్యుడు ముత్యాల నరేష్కు అందజేశారు.

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వారికి ఎంతో కొంత భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో *కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్, కౌన్సిలర్ రామ్ నాయక్, మాజీ కౌన్సిలర్లు బోజిరెడ్డి, సురేష్, నాయకులు మాధవ రెడ్డి, కరోనా ఖాదర్* తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY