Mahabubnagar: సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన SLVWPT బృందం!
Mahabubnagar: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు. మద్దాడి కృష్ణారెడ్డి, SLVWPT బృందం ప్రత్యేక జన్మదిన ఆకాంక్షలు.
Mahabubnagar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దిశగా నిరంతరం శ్రమిస్తున్న ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలానికి చెందిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర వేర్‌హౌసింగ్ అండ్ పీఎఫ్‌టీ ప్రైవేట్ లిమిటెడ్ (SLVWPT) బృందం మద్దాడి కృష్ణారెడ్డి, అడుసుమిల్లి రాము, లింగాల సుధీర్ రెడ్డి, లింగాల నితిన్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, నిండైన నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.




