Gachibowli: తెలంగాణ సగర మహిళా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక!
Gachibowli: తెలంగాణ సగర మహిళా సంఘం నూతన అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా జయమ్మ ఎన్నికయ్యారు.
Gachibowli: తెలంగాణ సగర మహిళా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక!
గచ్చిబౌలి: తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఆదివారం గచ్చిబౌలి అంజయ్య నగర్ లోని సగర సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో నిర్వహించిన సగర మహిళా సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిపారు. ప్రధానంగా బతుకమ్మ సంబరాల నిర్వహణతో పాటు సంఘం ప్రధాన డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న ఉద్యమం, బహిరంగ సభ నిర్వహణ పై చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, కార్యనిర్వహక కార్యదర్శులు లక్ష్మీనారాయణ సగర, వివేకానంద సగర, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మోడల రవి సగర, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర, గద్వాల జిల్లా అధ్యక్షులు తిమ్మప్ప సగర, నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాజు సగర, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దేవుని, మాజీ అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ సగర తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ
తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు గా నగర్ కర్నూల్ జిల్లా కు చెందిన అతినారపు విజయలక్ష్మి సగర, ప్రధాన కార్యదర్శి గా గ్రేటర్ హైదరాబాద్ ముసాపేట్ కు చెందిన సూర జయమ్మ సగర, కోశాధికారిగా గ్రేటర్ హైదరాబాద్ బొల్లారం కు చెందిన ఆస్కాని గాయత్రి సగర, మీడియా ఇన్చార్జ్ పెదబుద్ధి లావణ్య (లక్ష్మీ శ్రీరామ్) ఉపాధ్యకురాలుగా సరిత సగర, భాగ్యలక్ష్మి సగర, నిర్మల సగర, లలిత సగర, పద్మమమ్మ సగర, బి.లావణ్య సగర, దమయంతి సగర, సంయుక్త కార్యదర్శులుగా హేమలత సగర, ఆస్కాని లక్ష్మి సగర, కార్యనిర్వహక కార్యదర్శులుగా రామేశ్వరమ్మ సగర, కౌకుంట్ల లక్ష్మి సగర, కార్యవర్గ సభ్యులుగా కురిమిళ్ల జ్యోతి సగర లు నియమితులయ్యారు.
సలహాదారులుగా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సలహాదారులుగా బర్ల మనిమంజరి సగర, రేకబు సుమన్ లత సగర లు నియమితులయ్యారు.




