Makthal: తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే.. బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి!
Makthal: మక్తల్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని బీజేపీ నేత డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి అన్నారు.
Makthal: తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే.. బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి!
Makthal: మక్తల్ పట్టణ కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ ప్రతాప్ రెడ్డి గారి (ఇంటి ఆవరణలో) అధ్యక్షతన జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణాలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని, అంకెల గారడీతో, అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, భాజపాకు పట్టం కట్టడానికి తెలంగాణ ఓటరు మహాశయులు సమాయత్తం అవుతున్నారని తెలిపారు.
వికసిత్ బారత్ లక్ష్యంగా 2047 కల్లా భారతావనిని ప్రపంచంలోని అగ్రదేశాలకంటే ముందు వరుసలో నిలబెట్టాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న విశ్వగురువు, భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారిని చూసి యావత్ ప్రపంచం పులకించి పోతుంటే,
దేశంలోని కొందరు కాంగ్రెస్ కుహనా నాయకులు ఓట్ చోరీ అని, SIR ప్రక్రియ సరైనది కాదని అందువల్లే మేము ఓడిపోతున్నామని మాట్లాడడం వాళ్ళ అవివేకానికే వదిలేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి అద్దం పడుతుందని మక్తల్ నియోజకవర్గ MLC ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు ఎద్దేవా చేసారు.
తన ప్రాణమున్నంత వరకూ బాజపాలోనే కొనసాగుతానని,ఎవరెన్ని మాటలు మాట్లాడినా,ఎన్ని అడ్డంకులు వచ్చినా బీజేపీ కార్యకర్తల కష్ట సుఖాలలో పాలుపంచుకొని, మక్తల్ గడ్డపైన బీజేపీ జెండా ఎగిరేవరకు విశ్రమించబోనని డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు తెలియజేసారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బలరాంరెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీ కర్నేస్వామి గారు, మైనార్టీ మోర్చా నాయకులు శ్రీ మహబూబ్ అలిగారు, శ్రీ జమీన్ పాషా గారు,మండల అధ్యక్షులు శ్రీ జయానంద్ రెడ్డి గారు,శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా గెలుపే లక్షంగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం మండలం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు పొందినవారికి శాలువాతో సన్మానించి అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో మక్తల్,మాగనూర్ మరియు కృష్ణ మండలాల బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




